: 'బాహుబలి డైలాగ్స్ ట్రైలర్' విడుదల... ఏముందంటే...!


భారత చలనచిత్ర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం 'బాహుబలి' డైలాగులతో కూడిన ట్రైలర్ ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది. 31 సెకన్ల నిడివి వున్న ఈ ట్రైలర్ ను యూట్యూబ్ లో ఉంచారు. దీనిలో రానా, అనుష్కల మధ్య సంభాషణ, మరికొన్ని దృశ్యాలు ఉన్నాయి. "చచ్చేలోగా ఒక్కసారైనా చూడాలని నువ్వు, ఇంకొకసారి కసితీరా ఈ చేతులతో చంపాలని నేను..." అని అనుష్కను ఉద్దేశించి రానా అంటే, "మాహిష్మతీ... ఊపిరి పీల్చుకో, బాహుబలి తిరిగొచ్చాడు" అని అనుష్క చెప్పే డైలాగులున్నాయి. దీంతో పాటు ప్రభాస్ గుర్రంపై రావడం, లోయలోకి పడిపోవడం, యుద్ధంలో శత్రువులను చీల్చి చెండాడటం వంటి దృశ్యాలున్నాయి. ఈ ట్రైలర్ నేడు విడుదల కాగా, ఇప్పటికే లక్ష పాతిక వేల మందికి పైగా వీక్షించారు.

  • Loading...

More Telugu News