: విజయనగరం జిల్లా పంట పొలాల్లో దిగిన నేవీ హెలికాప్టర్


విజయనగరం జిల్లాలో ఈ మధ్యాహ్నం నేవీ హెలికాప్టర్ అకస్మాత్తుగా దిగింది. జిల్లాలోని కొత్తవలస మండలం ఎంఆర్ పురం సమీపంలోని పంట పొలంలో సాంకేతిక సమస్య కారణంగా హెలికాప్టర్ ను దింపారని తెలిసింది. ఆ సమయంలో అందులో ఉన్న ముగ్గురు సిబ్బంది క్షేమంగా ఉన్నారు. మరోవైపు, ఈ వార్త తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒక్కసారిగా వచ్చి హెలికాప్టర్ ను వింతగా చూశారు. హెలికాప్టర్ లోని లోపాన్ని సవరించేందుకు మరో విమానంలో నిపుణులు అక్కడికి వచ్చారు.

  • Loading...

More Telugu News