: ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం ప్రధానికి లేదు: కేంద్ర మంత్రి వీకే సింగ్


ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వ్యవహారం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండడంపై కేంద్ర మంత్రి వీకే సింగ్ స్పందించారు. ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం ప్రధానికి లేదని స్పష్టం చేశారు. తగిన సమయం వచ్చినప్పుడు ఆయనే మాట్లాడతారని అన్నారు. "మాట్లాడాలి, మాట్లాడాలి... అంటూ ఎందుకాయనను బలవంతం చేస్తారు? ప్రతి దానికి స్పందించడం సరికాదు కూడా. ఏదో న్యూస్ చానల్లో మరేదో ప్రసారమైతే దాని మీద ప్రధాని మాట్లాడాలా?... ప్రధాని మాట్లాడాలంటే తగిన సమయం రావాలి" అని పేర్కొన్నారు. ఈ విషయంపై చానళ్లు కొన్నిరోజులుగా కథనాలు ప్రసారం చేస్తున్నాయని, ఆ విధమైన కథనాలు ప్రసారం చేయాలంటూ ఆయా చానళ్లకు కాంట్రాక్టు ఎవరిచ్చారని వీకే సింగ్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News