: ప్రజలపై 'రుణ' ప్రభావం... గ్రీసులో జనం గగ్గోలు!
గ్రీసులో నెలకొన్న ఆర్థిక కష్టాల ప్రభావం ప్రజలపై పడింది. భారీ అప్పుల్లో కూరుకుపోయిన గ్రీస్ బయటపడే దారిలేక, ఖర్చులకు నిధుల్లేక వారం రోజుల పాటు బ్యాంకులను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రజలు ఒక్కసారిగా ఏటీఎంల వద్దకు నగదు తీసుకునే నిమిత్తం భారీ సంఖ్యలో చేరిపోయారు. కొన్ని ఏటీఎంల వద్ద కిలోమీటర్ల కొద్దీ లైన్లు పెరిగిపోయినట్టు సమాచారం. ఏటీఎంల్లో డబ్బు నిండుకోనుందన్న సమాచారంతో, స్పందించిన ప్రభుత్వం రోజుకు ఒక్కో ఖాతాలో 60 డాలర్లకు మించి నగదు విత్ డ్రా చేసుకోరాదని ఆంక్షలు విధించింది. కోపోద్రిక్తులైన ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు.