: ఇంట్లోకి దూసుకెళ్లి పేలిన విమానం!
విమాన ప్రమాదాలు సర్వసాధారణమైపోతున్నాయి. విమానాశ్రయాల్లో దిగాల్సిన విమానాలు రోడ్లు, పొలాలు, ఇళ్లు అనే తేడాలేకుండా ఎక్కడ పడితే అక్కడ ల్యాండైపోతున్నాయి. దీంతో పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత నెలలో సాంకేతిక లోపం కారణంగా హాలీవుడ్ నటుడు హారిసన్ ఫోర్డ్ నడుపుతున్న చిన్న పాటి విమానాన్ని పార్కులో దించేసిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలోని మసాచూసెట్స్ రాష్ట్రంలోని ప్లెయిన్ విల్లే పట్టణంలో నలుగురు నివసించే ఇంట్లోకి ఓ తేలికపాటి విమానం దూసుకొచ్చి పేలిపోయింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఇంట్లోని వారు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు, విచారణ చేపట్టారు.