: తలసాని మంత్రిగా కొనసాగడం చట్టవిరుద్ధం: మర్రి శశిధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ధ్వజమెత్తారు. తలసానిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ తరపున ఎన్నికల్లో గెలిచిన తలసాని టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా మంత్రిగా కొనసాగుతారని ప్రశ్నించారు. తలసాని విషయంలో సీఎం కేసీఆర్ గవర్నర్ ను తప్పుదారి పట్టించారని శశిధర్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారని మండిపడ్డారు. తలసాని టీఆర్ఎస్ లో కొనసాగడం చట్టవిరుద్ధమని అన్నారు.