: రాష్ట్రపతికి కేసీఆర్ పాదాభివందనం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాదులో అడుగుపెట్టారు. ఆయన బొల్లారంలో పది రోజుల పాటు ఉంటారు. కాగా, హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. కాగా, విమానం నుంచి కిందికి దిగిన ప్రణబ్ కు సీఎం కేసీఆర్ పాదాభివందనం చేశారు. తన కాళ్లకు నమస్కరించిన కేసీఆర్ ను రాష్ట్రపతి వీపు తట్టి ఆశీర్వదించారు.