: పవన్ కల్యాణ్ ట్విట్టర్ వ్యాఖ్యలపై వైసీపీ నేతల విమర్శలు


సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ విశాఖపట్నం నేతలు విమర్శలు చేశారు. ప్రశ్నిస్తానన్న పవన్ ఏడాది కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నిసార్లు ప్రశ్నించారో అందరికీ తెలుసునని వైసీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, ప్రసాదరెడ్డి అన్నారు. పవన్ తాజాగా ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యల్లో సమాజం కోసం తాపత్రయం కనిపించడం లేదన్నారు. ఆ వ్యాఖ్యలు ఆయన మేధావితనానికి అద్దం పడుతున్నాయని ఎద్దేవా చేశారు. అభిమానులను అడ్డం పెట్టుకుని ప్రపంచంలో ఏ నటుడు చేయనంత అవినీతిని ఆయన చేస్తున్నారని ఆరోపించారు. అభిమానులను ఎర చూపి టీడీపీ, బీజేపీ కూటమికి ఓట్లు వేయించి డబ్బు సంపాదించారని ఆరోపించారు. ట్విట్టర్ పోస్టులు చేస్తే డబ్బులు వస్తాయని పవన్ కొత్తదారి కనిపెట్టారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News