: నారాయణ గారూ...ఇదేం పధ్ధతి కాదు!: ఏపీ మంత్రిని నిలదీసిన రాజమండ్రి మేయర్


ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ, రాజమండ్రి నగరపాలక సంస్థ మేయర్ వాసిరెడ్డి రాంబాబు... ఇద్దరూ టీడీపీ నేతలే. అయితేనేం, ఓ విషయంలో మంత్రి నారాయణను రాంబాబు నిలదీశారు. మీరు చేస్తున్నదేమీ పధ్ధతిగా లేదంటూ మంత్రి ముఖం మీదే రాంబాబు చెప్పేశారు. అయితే, రాంబాబు వాదననేమీ పెద్దగా పట్టించుకోని నారాయణ, 'తర్వాత మాట్లాడుకుందాంలే' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారట. నేటి ఉదయం రాజమండ్రిలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద ఈ వాదన చోటుచేసుకుంది. త్వరలో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి కార్పొరేటర్లలో ఏ ఒక్కరికీ సమాచారం ఇవ్వకుండానే నారాయణ పనులు చేసుకునిపోతున్నారట. దీనిపై కార్పొరేటర్ల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ మంత్రిని రాంబాబు నిలదీశారు.

  • Loading...

More Telugu News