: టీమిండియా జట్టు సభ్యులపై లలిత్ మోదీ ఆరోపణలు నిరాధారం... బీసీసీఐ ప్రకటన
టీమిండియా క్రికెటర్లపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ చేసిన ఆరోపణలను బీసీసీఐ ఖండించింది. క్రికెటర్లపై లలిత్ మోదీ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని కొద్దిసేపటి క్రితం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడిన సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, డ్వేనీ బ్రేవోలకు ఫిక్సింగ్ తో సంబంధముందని రెండు రోజుల క్రితం లలిత్ మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఫిక్సింగ్ కు పాల్పడ్డ క్రికెట్లర్లకు కొందరు బుకీలు ఫ్లాట్లను కూడా బహుమతులుగా అందజేశారని ఆయన తన ట్విట్టర్ లో బాంబు పేల్చారు. అయితే లలిత్ మోదీ ఆరోపణలన్నీ అవాస్తవమని బీసీసీఐ ఖండించింది.