: పొట్టి దుస్తులు వద్దన్నందుకు విద్యార్థినీ విద్యార్థుల నిరసన


కోల్ కతాలోని ప్రతిష్ఠాత్మక 'స్కాటిష్ చర్చ్ కాలేజ్' యాజమాన్యం తీసుకున్న నిర్ణయం విద్యార్థినీ విద్యార్థులకు కోపం తెప్పించింది. కళాశాలలో విద్యా వాతావరణం దెబ్బతినకుండా ఉండేందుకు గాను పొట్టి దుస్తులను నిషేధిస్తున్నట్టు నోటీసు పెట్టడమే ఇందుకు కారణం. కాలేజీకి వేసుకొచ్చే దుస్తులు అభ్యంతరకరంగా ఉండరాదని, విద్యార్జనే లక్ష్యంగా విద్యార్థులు రావాలని కాలేజీ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా అమ్మాయిలు మోకాళ్లకు బాగా కిందకు ఉండే స్కర్టులు, సల్వార్ కమీజులు, చీరలు ధరించాలని సూచించింది. రౌండ్ నెక్ టీ షర్టులు, టాప్స్ ధరించి రావద్దని, ముఖ్యంగా వాటిపై ఎటువంటి స్లోగన్లు ఉండరాదని కూడా సూచించింది. ఇది వివక్షతో కూడిన నోటీసని ఆరోపిస్తూ విద్యార్థులు నిరసనలు చేపట్టారు. పలువురు విద్యావంతులు, వివిధ పార్టీల నేతలు కాలేజీ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News