: సిట్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు ప్రలోభపెట్టారు...ఏసీబీ కోర్టులో రేవంత్ పిటీషన్


ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ అధికారులు తనను కస్టడీలోకి తీసుకున్న సందర్భంగా సిట్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు తనను ప్రలోభపెట్టారని ఆయన ఏసీబీ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని కోరుతూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు. జ్యూడీషియల్ రిమాండ్ ముగిసిన సందర్భంగా నేటి ఉదయం ఏసీబీ అధికారులు రేవంత్ సహా మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయసింహలను కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయంపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు, ఏసీబీ దాఖలు చేసేన మెమోపై జరిగే విచారణలో రేవంత్ పిటీషన్ ను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.

  • Loading...

More Telugu News