: సీమాంధ్రుల రక్షణ కోసమే సెక్షన్ 8 అమలు కోరుతున్నాం: ఎంపీ రామ్మోహన్ నాయుడు


తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద చర్చకు తెరతీసిన సెక్షన్ 8 అమలుపై టీడీపీ యువనేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గళం విప్పారు. హైదరాబాదులో సీమాంధ్రుల రక్షణ కోసమే సెక్షన్ 8 అమలును కోరుతున్నామని ఆయన నేటి ఉదయం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని రానున్న పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన కోసం రూపొందించిన విభజన చట్టంలో అంతర్భాగమైన సెక్షన్ 8 అమలులో తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరాలెందుకని కూడా ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News