: జీహెచ్ఎంసీ ముందు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ధర్నా...‘స్వచ్ఛ’ నిధులు విడుదల చేయాలని డిమాండ్
టీ టీడీపీ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కొద్దిసేపటి క్రితం గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పెద్ద సంఖ్యలో అనుచరవర్గంతో కలిసి జీహెచ్ఎంసీ వద్దకు వెళ్లిన గోపీనాథ్, కేసీఆర్ సర్కారు వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వం ఉబుసుపోని కబుర్లతోనే కాలం వెళ్లదీస్తోందని ఆయన ఆరోపించారు. స్వచ్ఛ హైదరాబాదు కింద చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.