: అధినేత చంద్రబాబును కలసిన టీ.టీడీపీ నేతలు


టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ ఉదయం తెలంగాణ టీడీపీ నేతలు కలిశారు. హైదరాబాద్ లోని బాబు నివాసంలో నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు భేటీ అయ్యారు. ఓటుకు నోటు కేసుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిణామాలు, బీజేపీ మద్దతుతో వరంగల్ పార్లమెంటు ఉపఎన్నికలో అభ్యర్థిని బరిలోకి దింపే విషయం, త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల అంశాలపై చంద్రబాబుతో వారు చర్చించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి నిన్ననే అధినేతను కలవాలనుకున్న తెలంగాణ నేతలు అపాయింట్ మెంట్ కోరగా సీఎం బిజీగా ఉండటంతో ఈ రోజు రావాలని బాబు వారికి సూచించినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News