: జెరూసలెం యాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న జగన్... వెంటనే ఈడీ విచారణకు హాజరు
వైకాపా అధినేత జగన్ విదేశీ యాత్ర ముగిసింది. తన కుటుంబ సభ్యులతో కలసి ఆయన జెరూసలెం, ఆ తర్వాత యూరప్ దేశాల్లో పర్యటించారు. పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఆయనను వైకాపా నేతలు కలిశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి వారు చర్చించారు. పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా, ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇచ్చినందుకు జగన్ కు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం, అక్రమాస్తుల కేసులో ఈడీ విచారణకు జగన్ హాజరయ్యారు. వైకాపా నేత, ఆడిటర్ విజయసాయి రెడ్డి కూడా కోర్టుకు వచ్చారు.