: లలిత్ మోదీ మెయిల్ నిజమే... రైనా, బ్రావోల వ్యవహారం బీసీసీఐకీ తెలుసు: ఐసీసీ


ముగ్గురు ఐపీఎల్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, సురేష్ రైనా, బ్రావోలు బెట్టింగ్‌కు సహకరించినట్టు 2013లో ఐపీఎల్ మాజీ చైర్మన్ & కమిషనర్ లలిత్ మోదీ తమకు మెయిల్ పంపిన మాట వాస్తవమేనని ఐసీసీ అంగీకరించింది. ఆ సమాచారాన్ని అప్పుడే ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి పంపామని, బీసీసీఐ అవినీతి నిరోధక అధికారులకు కూడా సమాచారాన్ని చేరవేశామని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, వారేమి చర్యలు తీసుకున్నారన్న విషయంపై తమకు తిరిగి సమాచారం రాలేదని వెల్లడించింది. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులుగా ఉన్న ఈ ముగ్గురూ మ్యాచ్ లను ఫిక్స్ చేసేందుకు అంగీకరించి బుకీల నుంచి పెద్దఎత్తున డబ్బు స్వీకరించినట్టు మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ఆరోపించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News