: బహిరంగంగా ఉరితీయాలి: అక్షయ్ కుమార్
దేశం మరోమారు తలదించుకునే విధంగా ఐదేళ్ల చిన్నారిపై ఢిల్లీలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై బాలీవుడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఐదేళ్ల బాలికపై పశువులా ప్రవర్తించిన వ్యక్తిని పబ్లిక్ గా ఉరి తీయాలని నటుడు అక్షయ్ కుమార్ అన్నారు. ఈ ఘటనపై తాను చాలా బాధపడ్డానని చెప్పారు. సమాజంలో మహిళలను రక్షించేందుకు, లింగ సమానత్వంపై అవగాహన తెచ్చేందుకు ప్రభుత్వం, ఇతర సంస్థలు మరింత కృషి చేయాలని కోరారు. ఈ ఘటన దేశానికే అవమానకరమని నటులు అనిల్ కపూర్, జాన్ అబ్రహాం, తుషార్ కపూర్ అన్నారు. నిందితుడికి కఠినశిక్ష విధించాలని కోరారు.