: చంద్రబాబు వల్ల ఏమీ కాదు...సెక్షన్ 8 అమలు కాదు: టీఆర్ఎస్ నేత కేకే వ్యాఖ్య


టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వల్ల ఏమీ కాదని చెప్పిన ఆయన హైదరాబాదులో సెక్షన్ 8 అమలు కాబోదని తేల్చిచెప్పారు. కేవలం తాను ఇరుక్కున్న కేసు నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు సెక్షన్ 8 పల్లవి అందుకున్నారని ఆరోపించారు. తనకు సమస్య వచ్చింది కాబట్టే, చంద్రబాబుకు సెక్షన్ 8 గుర్తుకొచ్చిందని కేకే వ్యాఖ్యానించారు. ‘హైదరాబాదుపై జరుగుతున్న దాడులు’ పేరిట తెలంగాణ వికాస సమితి, తెలంగాణ సోషల్ ఫౌండేషన్, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య నిన్న హైదరాబాదులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కేకే ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News