: నటి పూజా గాంధీ మోసం చేసిందని నటుడి ఫిర్యాదు


ఏదో ఒక వివాదం రూపంలో వార్తల్లో ఉండే కన్నడ నటి పూజా గాంధీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమె తనను మోసం చేసిందని నటుడు డాక్టర్ సురేష్ శర్మ కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలికి ఫిర్యాదు చేశాడు. 'అభినేత్రి' అనే సినిమా కోసం ఆమె రూ. 1 కోటి తీసుకున్నారని, ఆ డబ్బు తిరిగి ఇవ్వమంటే ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశాడు. నగదు తిరిగి ఇప్పించాలని సురేష్ శర్మ కోరాడు. అయితే, తాను డబ్బిచ్చిన సమయంలో ఎటువంటి రాతకోతలూ జరగలేదని సురేష్ చెప్పడంతో, ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని పరిస్థితిలో సినీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఏదేమైనా ఫిర్యాదుపై పూజా గాంధీతో చర్చిస్తామని తెలిపారు. ఈ విషయంలో పూజా మాత్రం ఇంకా స్పందించలేదు.

  • Loading...

More Telugu News