: అరగంటలో రూ. 2 లక్షల కోట్లు ఆవిరి!


గ్రీస్ కష్టాలు, ఆసియా మార్కెట్ల పతనం ప్రభావం భారత స్టాక్ మార్కెట్ పై స్పష్టంగా కనిపించింది. ఉదయం 9 గంటలకు ప్రీ ఓపెన్ సెషన్లో 300 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్, 9:15 గంటలకు శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే 520 పాయింట్లు దిగజారి ఒత్తిడి మధ్య ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ అత్యంత కీలకమైన 8,250 స్థాయి నుంచి కిందకు జారి 8,222 పాయింట్లకు చేరింది. దీంతో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ రూ. 2 లక్షల కోట్లకు పైగా కోల్పోయినట్లయింది. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్ 466 పాయింట్లు పతనమై 1.68 శాతం నష్టంతో 27,345 పాయింట్ల వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు పడిపోయి 8,238 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50లో ఒక్క బీపీసీఎల్ మినహా మిగతా అన్ని కంపెనీలూ నష్టాల్లో ఉండడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్ కోటి కోట్ల రూపాయల మార్క్ నుంచి దిగజారి రూ. 99,76,462 కోట్లుగా ఉంది.

  • Loading...

More Telugu News