: 'గ్రెక్సిట్' భయంతో పెరిగిన బంగారం, క్రూడాయిల్ ధరలు


'గ్రెక్సిట్' (గ్రీస్ ఎగ్జిట్) భయాలు బులియన్, ఆయిల్ మార్కెట్లపైనా ప్రభావం చూపాయి. దీంతో బంగారం, ముడిచమురు ధరలు పెరిగాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారల్ కు 2 డాలర్లు పెరిగింది. సమీప భవిష్యత్తులో ముడిచమురు ధర బ్యారల్ కు 62 నుంచి 67 డాలర్ల మధ్య కదలాడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, మరోవైపు బంగారం ధరలు కూడా పెరిగాయి. ఔన్సు బంగారం ధర 0.6 శాతం పెరిగి 1,175 డాలర్లకు చేరింది. భారత మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 39 పెరిగి రూ. 26,524 వద్ద (ఆగస్టు 5 కాంట్రాక్టు) ట్రేడయింది. మిగతా కమోడిటీల్లో సిల్వర్, నేచురల్ గ్యాస్, అల్యూమినియం, కాపర్, నికెల్, జింక్, లెడ్, మిథనాల్ తదితరాల ధరలు ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News