: ‘కిక్కు’ దక్కేదెవరికో?... నేడే ఏపీలో ‘మద్యం’ లాటరీలు!


ఏపీలో మద్యం షాపులను దక్కించుకునేందుకు పెద్ద సంఖ్యలో వ్యాపారులు అబ్కారీ కార్యాలయాల వద్ద మొన్న బారులు తీరారు. పురుషులతో పోటీ పడి మహిళలు కూడా పెద్ద సంఖ్యలో బరిలో నిలిచారు. ఎక్సైజ్ శాఖ కార్యాలయాలకు వచ్చి మరీ తమ దరఖాస్తులు దాఖలు చేశారు. దీంతో ఒక్కో షాపుకు పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అందిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన అబ్కారీ శాఖ, నిన్న రాత్రికే వాటిని ఓ వరుస క్రమంలో అమర్చింది. మరికాసేపట్లో ఆయా జిల్లాల్లో లాటరీలను నిర్వహించనున్న అధికారులు మద్యం షాపులను వ్యాపారులకు కట్టబెట్టనున్నారు. దీంతో ఆయా జిల్లాల్లోని అబ్కారీ శాఖ కార్యాలయాల వద్దకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో వ్యాపారులు చేరిపోయారు. వెరసి ఎక్సైజ్ శాఖ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News