: కుర్చీల్లో కూర్చుని నిరసన తెలపడానికి బుద్ధి ఉండాలే!: ‘ఉపాధి’ సిబ్బందిపై కడియం ఫైర్!
సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపిన ఉపాధి హామీ పథకం సిబ్బందిపై నిన్న తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విచిత్రంగా స్పందించారు. ‘‘కుర్చీల్లో కూర్చుని నిరసన తెలపడానికి బుద్ధి ఉండాలి. ఏం.. తమాషా చేస్తున్నారా? స్టయిల్ పడుతున్నారా?’’ అంటూ ఆయన ఊగిపోయేసరికి ఉపాధి హామీ సిబ్బంది నోట మాట రాలేదు. రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండలం రాంపూర్ లో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో కడియం మాట్లాడుతుండగా, కార్యక్రమానికి హాజరైన ఉపాధి హామీ పథకం సిబ్బంది కుర్చీల్లో కూర్చునే ప్లకార్డులు చేతబట్టి తమ నిరసన తెలిపారు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న కడియం, 'ముందు మీరు కుర్చీల్లో నుంచి లేవండి' అంటూ వారిని గద్దించారు.