: ఉత్పత్తి ప్రారంభమైన తర్వాతే రాయితీలట...తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంలో కొత్త మెలిక!


రాష్ట్ర విభజన నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. పొరుగు రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికవేత్తలను తన్నుకుపోయేందుకు ఇరు రాష్ట్రాలు కాచుకు కూర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో అప్పటిదాకా ఉన్న రాయితీలు, వెసులుబాట్లను రెండు రాష్ట్రాలు మరికాస్త సడలిస్తాయని అంతా భావిస్తారు. అయితే తెలంగాణ సర్కారు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. నిర్ణీత కాల వ్యవధిలో పరిశ్రమలు స్థాపించకపోతే, కేటాయించిన స్థలాలను కూడా లాగేసుకుంటామని ఇప్పటికే కేసీఆర్ సర్కారు విస్పష్టంగా ప్రకటించింది. తాజాగా కొత్తగా అమల్లోకి రానున్న ఆ రాష్ట్ర ఇండస్ట్రియల్ పాలసీలో మరో మెలిక కూడా ఉందట. కొత్తగా పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలు తమ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాతే రాయితీల విషయంపై మాట్లాడాలట. ఒకవేళ రాయితీల కోసం ఆయా పారిశ్రామికవేత్తలు ముందుగానే దరఖాస్తు చేసుకున్నా, ఉత్పత్తి ప్రారంభమైన తర్వాతే వాటిని పరిశీలిస్తారట. దీంతో నిర్ణీత గడువులోగా ప్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేసిన పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం నుంచి అందే రాయితీల కోసం మాత్రం కనీసం 3 నెలల నుంచి 6 నెలల దాకా వేచి చూడాల్సిందేనట. ప్రస్తుతం ఈ విషయం పారిశ్రామికవర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News