: ఏపీ ఎంసెట్ కు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదు: ఉన్నత విద్యామండలి ఛైర్మన్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నిత్యం ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. తాజాగా, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని, అవరోధాలు కల్పిస్తోందని ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఏసీ ఎంసెట్ కు సంబంధించిన రికార్డులను అప్పగిస్తామని టీఎస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ... ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహాయ నిరాకరణను గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.