: ఈ రిస్ట్ బ్యాండును ధరిస్తే... మీ ఆరోగ్య సమస్యలను పసిగడుతుంది
ఓ అధునాతన రిస్ట్ బ్యాండ్ ను గూగుల్ సంస్థ రూపొందిస్తోంది. ఇది మనిషి ఆరోగ్య సమస్యలను ఇట్టే పసిగట్టేస్తుందని సమాచారం. ఈ బ్యాండ్ ధరిస్తే చాలు... గుండె కొట్టుకునే విధానం, మధుమేహం, బీపీ తదితర సమస్యలను గుర్తిస్తుంది. అంతేకాదు, అవసరమైతే ప్రతి నిమిషానికీ రికార్డు కూడా చేస్తుంది. ఈ బ్యాండ్ వల్ల డాక్టర్ల పని కూడా సులువు అవుతుంది. రోగుల సమస్యను వారు క్షుణ్ణంగా తెలుసుకోవడమే కాక, సరైన చికిత్సను అందించడానికి కూడా ఈ డేటా ఉపయోగపడుతుంది.