: హైదరాబాద్ తెలంగాణ జాగీరే: కేకే
ఏసీబీని ఆపే శక్తి ఎవరికీ లేదని టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు అన్నారు. దాని పని అది చేసుకుపోతుందని తెలిపారు. సెక్షన్-8పై గవర్నర్ కు బాధ్యతలు మాత్రమే ఉన్నాయని, అధికారం లేదని చెప్పారు. ఉమ్మడి రాజధానిలో ఇరు రాష్ట్రాలు పాలన సాగించవచ్చని తెలిపారు. అయితే, హైదరాబాద్ ముమ్మాటికీ తెలంగాణ జాగీరే అని చెప్పారు. ఏపీ మంత్రులు అవగాహన లేకుండా సెక్షన్-8పై మాట్లాడరాదని సూచించారు.