: కేసీఆర్ వ్యూహాత్మక మౌనం... తుపాను ముందు ప్రశాంతతా?


గత నాలుగు రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. ఓటుకు నోటు గురించి కాని, సెక్షన్-8 గురించి కాని ఆయన పెదవి విప్పడం లేదు. అయితే, వ్యూహాత్మకంగానే కేసీఆర్ ఈ మౌనం పాటిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనను అరెస్ట్ చేస్తే... కేసీఆర్ ప్రభుత్వానికి అదే చివరి రోజు అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబుపై కేసు పెట్టకపోతే తనకు రాజకీయపరంగా ఎన్నో ఇబ్బందులు వస్తాయని కేసీఆర్ భావిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అందుకే, ఈ కేసులో కొందరు రాజీ ప్రయత్నాలు చేసినా ఆయన మాత్రం తన పట్టు వీడటం లేదని తెలుస్తోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కేసీఆర్ తో భేటీ కావాలని ప్రయత్నించినా... ఉద్దేశ పూర్వకంగానే కేసీఆర్ కలవలేదని చెబుతున్నారు. ఈ కేసుతో తన ప్రతిష్ట ముడిపడి ఉందని కేసీఆర్ నమ్ముతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే, కేసీఆర్ వ్యూహాత్మక మౌనం... తుపాను ముందు ప్రశాంతతే అని అంటున్నారు.

  • Loading...

More Telugu News