: విభజన తరువాత తొలిసారి కలిసిన ఏపీ, టీఎస్ కాంగ్రెస్ నేతలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు తొలిసారిగా కలిశారు. మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహరావు 94వ జయంతి సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు కలిశారు. ఇరు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి కలసి వెళ్లి నక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. పక్కపక్కనే నిలబడి మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సంస్కరణలను అమలు చేసిన ఘనతను దక్కించుకున్న తొలి నేత పీవీ నరసింహరావేనని కొనియాడారు. వీరితో పాటు కేవీపీ రామచంద్రరావు, జానారెడ్డి తదితరులు ఒకేచోట కలిసి చాలా సేపు ముచ్చటించుకున్నారు.