: ఓటుకు నోటు కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐతో దర్యాప్తు చేయించాలి: దిగ్విజయ్ సింగ్
సంచలనం రేపుతున్న ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఎలాంటి కామెంట్ చేయలేదని... ఎమ్మెల్యే కొనుగోలుకు తాను ప్రయత్నించ లేదన్న విషయాన్ని స్పష్టం చేయలేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ నేపథ్యంలో, ఈ కేసును సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ కమిటీలు హైకోర్టులో పిల్ వేస్తాయని చెప్పారు. సెక్షన్-8 విషయంలో అన్ని పార్టీల నేతలు ఎవరి అవసరం మేరకు వారు మాట్లాడుతున్నారని... ఈ విషయంలో న్యాయవ్యవస్థ కల్పించుకుని స్పష్టత ఇవ్వాలని కోరారు.