: తైవాన్ లో ఘోరం... అగ్ని ప్రమాదంలో వందలాది మందికి గాయాలు
తైవాన్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం రాత్రి ఓ వాటర్ పార్కులో ఈ ప్రమాదం జరుగగా, 509 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వీరిలో 188 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. న్యూతైపీ నగరంలోని రీక్రియేషనల్ పార్క్ లో గత రాత్రి 10 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం తైపీతో పాటు తైవాన్ లోని పలు ఆస్పత్రులకు తరలించారు. కాగా, తైపీ నగర చరిత్రలో ఇంత ఘోర అగ్ని ప్రమాదం జరగడం ఇదే తొలిసారని అధికారులు వివరించారు. వందల సంఖ్యలో ఒకేసారి గాయపడడం ఇంతవరకూ జరగలేదని తెలియజేశారు.