: నూజివీడు ఆర్డీవో కారుపై దుండగుల దాడి


కృష్ణా జిల్లా నూజివీడు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) వాహనంపై ఆదివారం తెల్లవారుఝామున ముగ్గురు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నూజివీడు సమీపంలో జరిగింది. కారును అడ్డగించిన దుండగులు ఆర్డీవో కారు డ్రైవర్, అటెండర్‌ లను చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ ను నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తరువాత గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు గురించిన మరింత సమాచారం తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News