: కేసీఆర్ తరువాత ఎవరు సీఎం?... ఇదే ఆ కుటుంబంలో చర్చ: జూపూడి
త్వరలో తెలంగాణ సర్కారు పడిపోవడానికి సిద్ధంగా ఉందని తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ తరువాత ఎవరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలా? అన్న విషయమై ఆయన ఇంట్లో గోల మొదలైందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోవాలని కేటీఆర్, కవిత, హరీష్ రావులు ఎవరికి వారు కలలుకంటున్నారని అన్నారు. తరువాతి సీఎం ఎవరన్న విషయంలో ఆ పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే సమయంలో ఎలక్షన్ కమిషన్ కు తెలియకుండా ఏసీబీ స్టింగ్ ఆపరేషన్ ను ఎలా నిర్వహిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో టీ-ఏసీబీ అధికారులపై కేసులు పెట్టాలని జూపూడి డిమాండ్ చేశారు.