: గుజరాత్ లో 8 సింహాలు మృతి
భారీ వర్షాలు, ఆపై తన్నుకొచ్చిన వరదల కారణంగా గుజరాత్ లోని అమ్రేలీ జిల్లా క్రాంకచ్ పరిధిలో ఎనిమిది సింహాలు మృతి చెందాయి. వరద నీటిలో చిక్కుకుని ఇవి ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 45 మంది వరకూ మరణించినట్టు తెలుస్తోంది. సహాయ, పునరావాస చర్యల నిమిత్తం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్ డీఆర్ఎఫ్), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) దళాలు రంగంలోకి దిగాయి. సుమారు 100 మంది బాధితులను హెలికాప్టర్ల ద్వారా తరలించామని అధికారులు తెలిపారు. సూరత్ పరిధిలో 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చామని వివరించారు.