: లక్షల మంది ఏపీ విద్యార్థుల సమాచారం తెలంగాణ వద్ద ఉంది, మీడియా సాక్షిగా చర్చకు సిద్ధమా?: గంటా సవాల్
ఆంధ్రప్రదేశ్ కు చెందిన లక్షల మంది విద్యార్థుల సమాచారం తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉందని, ఉన్నత విద్యా మండలి విషయంలో అసత్య ప్రచారం చేస్తోందని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఏపీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై మీడియా సమక్షంలో తాను చర్చకు సిద్ధమని, తెలంగాణ తరపున ఎవరు వస్తారో తేల్చుకోవాలని ఆయన సవాల్ విసిరారు. పదో షెడ్యూల్ లోని విద్యా సంస్థల విషయంలో కేసీఆర్ సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు.