: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సెకండియర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన వారిలో 44.2 శాతం మంది ఉత్తీర్ణులైనట్టు వివరించారు. సప్లిమెంటరీలోనూ బాలురతో పోలిస్తే బాలికల్లోనే ఉత్తీర్ణత అధికంగా ఉందని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఫలితాలను goresults.net, eenadu.net , తదితర వెబ్ సైట్ల నుంచి తెలుసుకోవచ్చు.