: దేవుడికి దొంగనోట్ల కానుక!
భక్తులు భగవంతుడికి దొంగనోట్లు కానుకలుగా సమర్పిస్తున్నారు. కర్నూలు జిల్లాలో కొలువైన మహానందీశ్వరుడికి దొంగ నోట్లు కానుకలుగా వచ్చాయి. హుండీ లెక్కింపు జరుపుతున్న అధికారులకు రూ. 1000 దొంగనోట్లు కనిపించడంతో నివ్వెరపోయారు. కాగా, మొత్తం రూ. 26.50 లక్షల ఆదాయం లభించిందని, అన్నదానం హుండీలో రూ. 24,249ను భక్తులు సమర్పించారని ఆలయ ఈఓ వెల్లడించారు. 27 గ్రాముల బంగారం, 450 గ్రాముల వెండి, విదేశీ డాలర్ కూడా హుండీలో ఉన్నాయని వివరించారు. ఈ ఆదాయం 40 రోజులదని తెలిపారు.