: పెన్ డ్రైవే పీసీ... 'ఐడియా స్టిక్' వచ్చేస్తోంది!
ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్, 2 గిగాబైట్ల ర్యామ్, 32 గిగాబైట్ల ఇంటర్నల్ మెమరీ రెండోది. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్... ఈ సౌకర్యాలతో వచ్చిన కంప్యూటర్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా పెన్ డ్రైవ్ లా కనిపించే బుల్లి పీసీ మార్కెట్లోకి రానుంది. పూర్తి స్థాయి పీసీని అరచేతిలోకి ఇమిడేలా దీన్ని లెనోవో తయారు చేసింది. యూఎస్ బీ సపోర్టున్న ఏ టీవీకైనా దీన్ని తగిలిస్తే, అది కంప్యూటర్ గా మారిపోతుంది. కేవలం 1.5 సెంటీ మీటర్ల మందం ఉండే దీని ఖరీదు రూ. 8 వేలు మాత్రమే. దీనికి 'ఐడియా స్టిక్' అని లెనోవో పేరు పెట్టింది.