: సండ్రకు మిగిలింది ఒక్కరోజే... వేగంగా కదులుతున్న ఏసీబీ!


ఓటుకు నోటు కేసులో, వైద్యం, విశ్రాంతి పేరిట ఏసీబీ విచారణను 10 రోజుల పాటు తప్పించుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఇక ఒక్కరోజు గడువు మాత్రమే మిగిలింది. ఏసీబీ అధికారులకు ఆయన ఈ నెల 19న పంపిన లేఖ ప్రకారం, పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని సండ్రకు వైద్యులు సలహా ఇచ్చారు. ఆ పది రోజుల గడువు సోమవారంతో ముగియనుంది. ఆపై ఆయన విచారణకు హాజరవుతారా... లేదా?, అసలాయన ఎక్కడ ఉన్నారు? ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు? ఈ విషయాలపై ఎవరికీ సమాచారం లేదు. ఒకవేళ సండ్ర సోమవారం తరువాత కూడా విచారణకు హాజరుకాకుంటే, కోర్టు ద్వారా ముందుకెళ్లాలని ఏసీబీ భావిస్తోంది. అదే జరిగితే ఆయన మరిన్ని ఇబ్బందుల్లో పడ్డట్టే. ఆయనపై చర్యలకు ఏసీబీ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News