: సెక్షన్-8 వేరు, ఓటుకు నోటు వేరు... కేంద్రం జోక్యం చేసుకోబోదన్న రాజ్ నాథ్
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తనకున్న అధికారాలన్నీ పూర్తిగా వినియోగించుకుంటూ విధులను నిర్వర్తించవచ్చని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విభజన చట్టంలోని సెక్షన్-8ను ప్రత్యేకంగా అమలు చేసేందుకు ఎటువంటి ఆదేశాలూ అవసరం లేదని, కావాలనుకుంటే ఎప్పుడైనా కల్పించుకోవచ్చని నరసింహన్ కు సలహా ఇచ్చారు. సెక్షన్-8 వేరు, ఓటుకు నోటు వేరని వ్యాఖ్యానించిన రాజ్ నాథ్, కేసు విషయాన్ని కోర్టు చూసుకుంటుందని చెప్పినట్టు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. కేసు విషయంలో కేంద్రం ఎటువంటి మార్గనిర్దేశకాలు ఇవ్వబోదని కూడా హోం మంత్రి వెల్లడించినట్టు తెలుస్తోంది.