: 9 చదవకపోయినా 10వ తరగతికి అవకాశం... చదువు మధ్యలో ఆపివేసిన వారికి కేంద్రం కొత్తపథకం


ఏవైనా కారణాలతో చదువును ఆపేసిన వారి కోసం కేంద్రం కొత్త పథకం ప్రారంభించనుంది. ఇందులో భాగంగా తొమ్మిదో తరగతి చదవక పోయినా, పదవ తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాదికి కనీసం ఒక సబ్జెక్టు పాస్ అవుతూ, పది పూర్తి చేయొచ్చు. కేంద్రమానవ వనరుల అభివృద్ధిశాఖ ఈ పథకాన్ని అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో కసరత్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 10వ తరగతి పరీక్షకు హాజరుకావాలని భావించే వారు మొదట ఆన్‌ లైన్‌ లో తమ పేరు నమోదు చేయించుకోవాలి. 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒపెన్ స్కూలింగ్' ప్రతి ఒక్కరికీ ఒక్కో నెంబరును కేటాయిస్తుంది. ఈ వివరాలు గ్రామపంచాయతీ ఆఫీసుల నుంచి అభ్యర్థులకు అందుతాయి. చదువు మధ్యలోనే ఆపివేసిన ఏ వయసు వారైనా పరీక్షలకు హాజరు కావచ్చు. ఆపై ఉన్నత చదువుల కోసం 'మాసివ్ ఒపెన్ ఆన్‌లైన్ కోర్స్' ద్వారా వీరికి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలియజేశారు.

  • Loading...

More Telugu News