: హన్సికతో చిందేసిన మోహన్ బాబు, అనిల్ కపూర్
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, టాలీవుడ్ నటుడు మోహన్ బాబు కలసి బహుభాషా నటి హన్సికతో చిందేశారు. తమిళ సినిమా 'వుయిరే వుయిరే' ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ ఆడియో వేడుకకు జయప్రద, రాధిక, అమర్ సింగ్, సుబ్బరామిరెడ్డి, అనూప్ రూబెన్స్ తదితరులు హాజరయ్యారు. ఆడియో విడుదల సందర్భంగా అనిల్ కపూర్, మోహన్ బాబుతో కలసి హన్సిక డ్యాన్స్ చేయడం అభిమానులను అలరించింది. 'వుయిరే వుయిరే' సినిమాను ఆదరించాలని, సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలని ఆహూతులు ఆశీస్సులు అందించారు.