: ధోనీ, కోహ్లీ మధ్య విభేదాలా, ఎవరు చెప్పారు?: షమీ


టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నట్టు మీడియాలో వార్తలు వెలువడడంపై టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత కొంత కాలంగా వారిద్దరితోనూ డ్రెస్సింగ్ రూం పంచుకుంటున్నానని, వారి మధ్య విభేదాలు ఉన్నట్టు ఏనాడూ అనిపించలేదని షమీ తెలిపాడు. జట్టు రెండుగా చీలిపోయి చెత్త ప్రదర్శన ఇవ్వడం అనేది జరగదని, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న విషయం ఆటగాళ్లకు తెలుసని స్పష్టం చేశాడు. జట్టు రెండు బృందాలుగా చీలిపోయిందనేది పూర్తిగా అబద్ధమని షమీ తెలిపాడు. ఇలాంటి పుకార్లను ప్రజల వద్దకు తీసుకెళ్లవద్దని షమీ మీడియాకు సూచించాడు.

  • Loading...

More Telugu News