: బారులు తీరిన మద్యం వ్యాపారులు...టెండర్ల ప్రక్రియకు ఆదరణ


ఆంధ్రప్రదేశ్ లో మద్యం టెండర్ల ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. గడువు ముగిసినా టెండర్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు స్తబ్దుగా ఉన్న లిక్కర్ సిండికేట్లు సాయంత్రానికి జూలు విదిల్చాయి. లిక్కర్ సిండికేట్ల ప్రతినిధులు సాయంత్రం టెండర్లు వేసేందుకు ఉత్సాహం చూపినట్టు తెలుస్తోంది. దీంతో సమయం ముగిసినప్పటికీ టెండర్ల దాఖలు కొనసాగుతోంది. మద్యం వ్యాపారులు క్యూలైన్లలో బారులు తీరారు. టోకెన్లు అందుకున్నవారు పూర్తయ్యే వరకు లిక్కర్ టెండర్ల ప్రక్రియ కొనసాగనుంది. కృష్ణా జిల్లాలో మొత్తం 335 మద్యం షాపులు ఉండగా, వాటికి 2100 టెండర్లు దాఖలయ్యాయి. ఇంకా 600 మంది క్యూలో నిల్చున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కారణంగా ప్రకాశం జిల్లాలో టెండర్ల ప్రక్రియ వాయిదా పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 475 మద్యం షాపులుండగా, ఇప్పటి వరకు 4000 దరఖాస్తులందాయి. సిండికేట్లు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. రేపు టెండర్లను అధికారులు పరిశీలించనున్నారు. కాగా, ఈ నెల 29న కలెక్టర్ల ఆధ్వర్యంలో షాపుల కోసం డ్రా నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News