: జులై 15 నాటికి భూసేకరణ ప్రక్రియ పూర్తి: నారాయణ
జులై 15 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం చేస్తున్న భూసేకరణ పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రైతుల నుంచి ఒప్పంద పత్రాలు అందుకుంటున్నామని అన్నారు. సుమారు 23 వేల ఎకరాలకు సంబంధించిన ఒప్పందాలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. భూసేకరణ ప్రక్రియ హడావుడిగా చేస్తే, భవిష్యత్ లో రాజధాని ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి ఇబ్బందులేవీ తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. అనుకున్నట్టు భూసేకరణ పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.