: సినీ సన్నివేశం రాజస్థాన్ లో చోటుచేసుకుంది!


రాజకీయాల్లో ఎదిగేందుకు ఓ నేత అభం శుభం తెలియని చిన్నారిని రహస్య వివాహం చేసుకుంటాడు. తర్వాత ఆ వార్త లీక్ అవుతుంది. అతని రాజకీయ జీవితానికి ఇబ్బందులు ఎదురవుతాయి... చాలా తెలుగు సినిమాల్లో ఇలాంటి సన్నివేశం కనిపిస్తుంది. ఇలాంటి ఘటన రాజస్థాన్ లోని చిత్తఘడ్ జిల్లాలో చోటుచేసుకుంది. గంగ్రార్ పంచాయతీ సమితికి చెందిన నేత రతన్ జాట్ (35) గత వారం పడోలీ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. బాలిక కుటుంబ సభ్యులు దగ్గరుండి మరీ ఈ వివాహం జరిపించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటో ఒకటి వాట్స్ యాప్ లో హల్ చల్ చేసింది. దీంతో ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రాథమిక ఆధారాలతో అతనిపై కేసు నమోదు చేశారు. వివాహ తంతు ముగిసిన తరువాత వధూవరుల కుటుంబాలు రెండూ ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాయని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమ శాఖకు చెందిన ఓ అధికారి నివేదిక తయారు చేస్తున్నట్టు వారు వెల్లడించారు. బాల్య వివాహ నిరోధక చట్టం-2006 ప్రకారం అతనిపై కేసు నమోదు చేస్తామని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News