: తెగే దాకా లాగద్దు... చివరికి నష్టపోయేది ప్రజలే!: ట్విట్టర్లో పవన్ కల్యాణ్


తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పలు ట్వీట్ల ద్వారా ఆయన తన మనసులో భావాలు బయటపెట్టారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు ప్రజలే ఇబ్బంది పడేలా వ్యవహరించకుండా విజ్ఞత పాటిస్తే మంచిదని అన్నారు. రాజకీయం అంటే దెబ్బకి దెబ్బ తీయడమే అయితే, నెల్సన్ మండేలా తెల్లవారిపై మన లీడర్ల లాగే కక్ష తీర్చుకునే వాడేమో, కానీ, ఆయన తన ప్రజల కోసం, దీర్ఘకాలిక లక్ష్యం కోసం, శాంతి మార్గం ఎంచుకున్నారని ఆయన గుర్తు చేశారు. మన నాయకులు కూడా ఆయన చూపిన మార్గంలో వెళ్తారని భావిస్తున్నానని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'తెగే దాక ఏదీ లాగొద్దని' అంటారు. అయినా మన నాయకులు అలాగే వెళ్తే... అంతిమంగా నష్టపోయేది వారిని ఎన్నుకున్న ప్రజలేనని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News