: అల్ ఖైదాలోనూ 'జిహాదీ జాన్' ఉన్నాడు!


ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో జిహాదీ జాన్ ఎంత ప్రాచుర్యం పొందాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచినీళ్ల ప్రాయంగా పీకలు కోయడం అతడి స్పెషాలిటీ. బ్రిటీష్ జాతీయుడైన అతగాడు తన చిరునామా వెల్లడి కావడంతో సిరియాకు మకాం మార్చాడు. ఇప్పుడు అతడి తరహాలోనే అల్ ఖైదాలోనూ ఓ ఉగ్రవాది తయారయ్యాడు. అల్ ఖైదా విడుదల చేసిన తాజా వీడియో ద్వారా ఈ విషయం తేటతెల్లమైంది. ఇద్దరు బందీలకు తుపాకీ గురిపెట్టి అతగాడు మాట్లాడడం ఆ వీడియోలో కనిపిస్తుంది. వారిని విడిపించేందుకు చర్చలు జరుగుతున్నాయని ఆ మిలిటెంట్ బందీలతో చెప్పడం చూడొచ్చు. ఆ మిలిటెంట్ కూడా అచ్చు జిహాదీ జాన్ లానే బ్రిటన్ యాసలో ఇంగ్లీషు మాట్లాడుతుండడంతో అతడెవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ అల్ ఖైదా జిహాదీ జాన్ ముఖానికి ముసుగు ధరించి, మిలిటరీ దుస్తుల్లో ఉన్నాడు.

  • Loading...

More Telugu News