: ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేకి నోటీసులు


ప్రధాని నరేంద్ర మోదీపై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజ్ పురోహిత్ కు బీజేపీ శనివారం నోటీసులు జారీ చేసింది. వ్యాఖ్యల విషయమై వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో కోరింది. పురోహిత్... ప్రధాని మోదీపైనా, బీజేపీ చీఫ్ అమిత్ షాపైనా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పైనా వ్యాఖ్యలు చేయగా, దాని తాలూకు వీడియో వెలుగులోకి వచ్చింది. దాంతో, ఈ బీజేపీ ఎమ్మెల్యేపై రాష్ట్ర శాఖతో పాటు అధినాయకత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే, పురోహిత్ కు నోటీసులు వెళ్లాయి. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, మోదీ, అమిత్ షా అధికారాన్ని గుప్పిట పెట్టుకుని వ్యవహరిస్తున్నారని పురోహిత్ వ్యాఖ్యానించారు. అటు, సీఎం ఫడ్నవీస్ పై వ్యాఖ్యానిస్తూ... ఆయన నిస్సహాయుడిగా మారిపోయారని, అధినాయకత్వం ఒత్తిళ్ల కారణంగా ఏం చేయలేకపోతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News